వ్యాస మహర్షి భాగవత రచనా ప్రారంభము - కారణాలు భాగవతం - భాగవతం ఒక మహా గ్రంధము. భాగవతం చదవటం లేదా వినటం ద్వార అన్ని పాపాలు తొలిగి పొతాయి.ఈ భాగవతాన్ని తెలుగులో సరళమైన భాషలో చెప్పడానికి చెస్తున్న చిన్న ప్రయత్నం. ఈ భాగవతంలొ శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాలు మరియు భాగవతం రాయడానికి గల కారణాలు చెప్పబడతాయి. అంతులేని దారుణమైన భయానక హింసాకాండ నుండి పుట్టుకువచ్చిన శాంతి, భక్తి సందేశమే భాగవతం. వ్యాస మహర్షి పద్దెనిమిది పర్వాలుగా మహాభారత ఇతిహాస గ్రంధాన్ని రచించాడు. కురుక్షేత్ర రణరంగంలో శవాలు గుట్టలుగా పడి, ద్వేషం పెను మంటగా రగిలి, ప్రతికారజ్వాలలు నింగికి ఎగసి, మహిళల ఏడ్పులు లోకాలన్నీ ద్వనించి ముగిసింది మహాభారతం. ఇంతటి దారుణ మారణకాండ వలన పాండవులు సాధించిందేమిటి, హస్తినాపుర ప్రజలకు దక్కింది ఏమిటి, చివరకు కురువంశం నశించింది, యదుకులం కూడా అంతమైంది, పాండవులు స్వర్గారోహణ చేసారు. కురుక్షేత్రంలో జరిగిన హింస తెలియచేయటం ద్వారా తాను సాధించినది ఏమిటని ఆవేదనకు, దుఖానికి గుర...
Comments
Post a Comment