వ్యాస మహర్షి భాగవత రచనా ప్రారంభము - కారణాలు
భాగవతం - భాగవతం ఒక మహా గ్రంధము. భాగవతం చదవటం లేదా వినటం ద్వార అన్ని పాపాలు తొలిగి పొతాయి.ఈ భాగవతాన్ని తెలుగులో సరళమైన భాషలో చెప్పడానికి చెస్తున్న చిన్న ప్రయత్నం. ఈ భాగవతంలొ శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాలు మరియు భాగవతం రాయడానికి గల కారణాలు చెప్పబడతాయి.

అంతులేని దారుణమైన భయానక హింసాకాండ నుండి పుట్టుకువచ్చిన శాంతి, భక్తి సందేశమే భాగవతం. వ్యాస మహర్షి పద్దెనిమిది పర్వాలుగా మహాభారత ఇతిహాస గ్రంధాన్ని రచించాడు. కురుక్షేత్ర రణరంగంలో శవాలు గుట్టలుగా పడి, ద్వేషం పెను మంటగా రగిలి, ప్రతికారజ్వాలలు నింగికి ఎగసి, మహిళల ఏడ్పులు లోకాలన్నీ ద్వనించి ముగిసింది మహాభారతం. ఇంతటి దారుణ మారణకాండ వలన పాండవులు సాధించిందేమిటి, హస్తినాపుర ప్రజలకు దక్కింది ఏమిటి, చివరకు కురువంశం నశించింది, యదుకులం కూడా అంతమైంది, పాండవులు స్వర్గారోహణ చేసారు. కురుక్షేత్రంలో జరిగిన హింస తెలియచేయటం ద్వారా తాను సాధించినది ఏమిటని ఆవేదనకు, దుఖానికి గురి అయ్యాడు వ్యాస మహర్షి. ద్వేషం, కోపం, అసూయా హింసకు దారితీస్తాయి. కేవలం భక్తి శాంతికి దారితీస్తుంది. అలా చాల ఏళ్ళు వ్యాసమహర్షి తనలోతాను ఘర్షణ పడుతుండగా నారదుడు ఒక రోజు ఆయన వద్దకు వచ్చి కేవలం భక్తి మాత్రమే శాంతిని ప్రసాదిస్తుంది కనుక నీవు భగవంతుని గురించి రచనచేయి అని చెబుతాడు.ఆ విధంగా నారదుడి ఉపదేశం వలన మహా భాగవత రచన చేసి ప్రచారం చేసాడు వ్యాసమహర్షి. ఈ విధంగా వ్యాసమహర్షి చేత రచించాబడిన
భాగవతం వ్యాసమహర్షి కుమారుడు శుకుడు అధ్యాయనం చేస్తాడు. ఆ తరువాత శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు ఈ భాగవతం వినిపించటం వలన భాగవత ప్రచారం జరిగింది. అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు ఒక ముని శాపం వలన ఏడు దినములలో మరణిస్తాడు. మరణించబోయే ఏడు దినములు కూడా భక్తి కధా కాలక్షేపంలో గడపాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో అక్కడకు శుకమహర్షి వస్తాడు. ఆయనను ఈ ఏడు రోజులు విష్ణువు కథలను చెప్పమని ప్రార్థిస్తాడు. శుకుడు ఆ విధంగా పరీక్షిత్తుకి ఏడు రోజులలో భాగవత పురాణం వినిపిస్తాడు. పరిక్షిత్తుకి భాగవతం వినిపిస్తున్నప్పుడు అక్కడే ఉండి ఉగ్రస్యవసు వింటాడు. ఇతడు నైమిశారణ్యంలో శవనకుడు అను ముని జరిపిస్తున్న సత్రయాగం వద్ద వారికి ఈ భాగవత పురాణాన్ని వినిపిస్తాడు. ఇలా మూడు దశలలో ఈ భాగవతం ప్రజలలకు చేరింది. మొదట వ్యాసమహర్షి చేత వ్రాయబడి,రెండవది శుకమహర్షి చేత పరీక్షిత్తుకి చెప్పబడి, మూడవది ఉగ్రస్యవాసు చేత వెలది మునుల సమక్షంలో వినిపించబడింది. భాగవతం పద్దెనిమిది వేల శ్లోకములుగా, పన్నెండు స్కందములుగా విభజించబడింది. అలా సంస్కృతంలో రాయబడిన భాగవతం తెలుగులో అనువదించినది మాత్రం బమ్మెర పోతన.
భాగవతం మనిషిలో భక్తిని ఏర్పరుస్తుంది. భక్తి అనేది మానసికమైనది. భగవంతునితో మానసికమైన ఒక సంబంధాన్ని ఏర్పరుస్తుంది. సుఖదుఃఖాలు, లాభనష్టాలు అన్నీ సమానమే అన్న దృక్పధాన్ని భక్తి మార్గం కలిగించటం ద్వారా మానసిక శాంతితో మానసిక కష్టాలను ముందుకు దాటుకునేలా చేస్తుంది. భావతంలో మహావిష్ణువు అవతారాలు ఉంటాయి.
https://www.youtube.com/watch?v=qFjnxd7AQp4
I want telugu narayaneyam
ReplyDeleteSorry Andi rayalenu, it is looking waste of my time
Delete