విష్ణుమూర్తి అవతారాలు - సృష్టి పరిణామ క్రమ వివరణ
భగవంతుడి అవతారాలకు భూమిపై సృష్టికి గల అవినాభావసంబంధం గురించి తెలుసుకుందాం. ఈ భూమి మీద మానవ జననం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసారు. భూమి మొదట ఒక అగ్నిగోళంలా ఉండేది. కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచాక చల్లబడింది. ఆ తరువాత ఎడతెరిపి లేకుండా లక్షల ఏళ్ళు వర్షాలు కురిసి సముద్రాల, నదులు ఏర్పడ్డాయి.
ఆలా సముద్రాల, నదుల నుండి ఏర్పడిన తేమ జీవి పుట్టుకకు కారణం అయ్యింది. మొదట కర్బన సేంద్రీయ పదార్థం ఏర్పడింది. అది ఏకకణ జీవిగా మారింది. ఆ ఏకకణ జీవి కాలక్రమేణా బహుకణ జీవిగా మారింది. ఆ తరువాత కొన్ని లక్షల సంవత్సరాల తరువాత నీటిలో జీవించే జలచరాలు ఎన్నో పుట్టుకువచ్చాయి. వాటి అన్నింటి స్పష్టమైన రూపంగా చివరికి చేప పుట్టింది. ఈ చేప మహావిష్ణువు మొదటి అవతారం అయినా మశ్చ్యావతారం. ఆ తరువాత జలచరం నేలపైకి రావడానికి ప్రయత్నంచేసింది. అలా కొన్ని వేల ఏళ్ళ ప్రయత్నం వలన జలచరం కాస్త ఉభయచరంగా మారింది. ఉభయచరం అనగా నేలపై మరియు నీటిపై సంచరించునది. అలా ఉభయచరమైన తాబేలు ఆవిర్భవించింది. ఆ తాబేలు మహావిష్ణువు రెండవ అవతారం అయిన కూర్మావతారం. తరువాత ఉభయచరం నీటిలోకి వెళ్ళటం మానివేసింది. దానితో నాలుగు కాళ్లతో నేలపై నడిచే జంతువుకు వచ్చాయి. అలా వచ్చిందే వరాహం. ఈ వరాహం విష్ణుమూర్తి మూడవ అవతారం. ఈ జంతువులు వాటి ఆహారం అయిన చెట్ల ఆకుల కోసం మరియి పండ్ల కోసం రెండు కాళ్లతో నిలబడసాగాయి. అలా రెండుకాళ్లతో నిలబడ గల జంతువులు వచ్చాయి. దీన్ని సూచించేది విష్ణువు యొక్క నాల్గవ అవతారం నరసింహావతారం. రెండు కళ్లు రెండు చేతులు వుండి తలమాత్రం మృగం అయిన సింహం తల వుంటుంది. ఆ తరువాత పూర్తి మానవరూపంలో మొదటి మనిషి ఆవిర్భవించాడు. కానీ అతడు తెలివి లేకుండా మూర్ఖంగా ఉండేవాడు. దీనిని సూచించడానికి నేలకు మూడు అడుగుల ఎత్తుతో వామనుడిగా వస్తాడు మహావిష్ణువు. బలిచక్రవర్తి రూపంలో ఉన్న అజ్ఞానాన్ని పాతాళానికి తొక్కేస్తాడు. ఆ తరువాత పరుశురాముడిగా, శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా అవతరించాడు మహావిష్ణువు. రజో గుణముతో పరశురామ అవతారంలో జన్మిస్తాడు . అపరిమితమైన కోపం, ప్రతీకారం చెడుపైనే ఉండాలని చెబుతాడు. సత్వగుణముతో శ్రీరాముడిగా అవతరించి సాదు గుణముతో లోకానికి మంచి గుణములు ఏమిటో తెలియచేసాడు. తామస గుణముతో శ్రీకృష్ణుడిగా జన్మిస్తాడు. తరువాత కల్కి అవతారంగా మహావిష్ణువు రాబోతున్నాడు. అప్పటితో కలియుగం పూర్తి అయ్యి తిరిగి సత్యయుగం ప్రారంభం అవుతుంది.
ఇలా మశ్చ్యావతారం నుండి కల్కి అవతారం వరకు మానవుని యొక్క పరిణామక్రమాన్ని చూపిస్తుంది. ఇది శాస్త్రవేత్తలు నిరూపించిన పరిణామక్రమానికి సరిపోతుంది. ఈ విధంగా మహావిష్ణువు ధరించిన అన్ని అవతారాల గురించి ఈ భాగవతంలో ఉంటాయి.
Comments
Post a Comment