పరీక్షిత్తు - కలి కధ మరియు పరీక్షిత్తు మరణం ఈ భాగవతం నాల్గవ భాగంలో పరీక్షిత్తు మహారాజు కలిపైకి విల్లును ఎందుకు ఎక్కు పెట్టాడు?, పరీక్షిత్తు ఏడు రోజుల్లో తక్షకుడి కాటుకు మరణిస్తాడు అని శృంగి ఎందుకు శపించాడు అన్న కధలను చెప్పుకుందాం. శ్రీకృష్ణుని మరణం తరువాత భూలోకానికి కలి ప్రవేశించాడు. కుటిలత్వం, హింస, లోభితనం, మోసం లోకం అంతటా విస్తరించసాగాయి. ఈ విషయాలను ధర్మరాజు గమనించాడు. ఇక తాను కూడా భూలోకాన్ని విడిచి వెల్ల వలసిన సమయం వచ్చేసిందని నిర్ణయానికి వచ్చేసాడు. దానితో తమ ఏకైక వారసుడు అభిమన్యుని కుమారుడు పరిక్షిత్తును హస్తినాపురం చక్రవర్తిగా అభిషేకించాడు. అనిరుద్ధుడి కుమారుడు అజుడు అను వాడిని మధురా నగరానికి రాజుని చేసాడు. తరువాత ఇల్లుని రాజ్యాన్ని వదిలి ఉత్తరం వైపుకు పిచ్చిపట్టిన వాడిలా నడుస్తూ వెళ్ళాడు. భీమ, అ...
భాగవతం ఒక మహా గ్రంధము. భాగవతం చదవటం లేదా వినటం ద్వార అన్ని పాపాలు తొలిగి పొతాయి.ఈ భాగవతాన్ని తెలుగులో సరళమైన భాషలొ చెప్పడానికి చెస్తున్న చిన్న ప్రయత్నం.ఈ భాగవతంలొ శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాలు మరియు భాగవతం రాయడానికి గల కారణాలు చెప్పబడతాయి.