పరీక్షిత్తు - కలి కధ మరియు పరీక్షిత్తు మరణం ఈ భాగవతం నాల్గవ భాగంలో పరీక్షిత్తు మహారాజు కలిపైకి విల్లును ఎందుకు ఎక్కు పెట్టాడు?, పరీక్షిత్తు ఏడు రోజుల్లో తక్షకుడి కాటుకు మరణిస్తాడు అని శృంగి ఎందుకు శపించాడు అన్న కధలను చెప్పుకుందాం. శ్రీకృష్ణుని మరణం తరువాత భూలోకానికి కలి ప్రవేశించాడు. కుటిలత్వం, హింస, లోభితనం, మోసం లోకం అంతటా విస్తరించసాగాయి. ఈ విషయాలను ధర్మరాజు గమనించాడు. ఇక తాను కూడా భూలోకాన్ని విడిచి వెల్ల వలసిన సమయం వచ్చేసిందని నిర్ణయానికి వచ్చేసాడు. దానితో తమ ఏకైక వారసుడు అభిమన్యుని కుమారుడు పరిక్షిత్తును హస్తినాపురం చక్రవర్తిగా అభిషేకించాడు. అనిరుద్ధుడి కుమారుడు అజుడు అను వాడిని మధురా నగరానికి రాజుని చేసాడు. తరువాత ఇల్లుని రాజ్యాన్ని వదిలి ఉత్తరం వైపుకు పిచ్చిపట్టిన వాడిలా నడుస్తూ వెళ్ళాడు. భీమ, అ...
శుక మహర్షి మరియు పరీక్షిత్తు జన్మ రహస్యం భాగవతం మూడవ భాగములో వ్యాస మహర్షి కుమారుడైన శుక మహర్షి జన్మ రహస్యాన్ని, ఈ శుక మహర్షి భాగవతాన్ని చెప్పడానికి గల కారణమైన పరీక్షిత్తు మహారాజు జన్మ రహస్యాన్ని గురించి తెలుసుకుందాము. నైమిశారణ్యంలో శవనకుడు అను ముని పన్నెండు ఏళ్లు జరుగు సత్రయాగం చేస్తూ వున్నాడు. అక్కడ వేలాదిగా మునులు యజ్ఞములో పాల్గొంటు ఉన్నారు. అటువంటి ప్రదేశంలో సూతుడు అను ఒక గొప్ప కధకుడు వారికి భగవంతుడి గురించి కథలను వినిపిస్తూ ఉన్నాడు. అక్కడి మునుల కోరికఫై భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ముందుగా భాగవతాన్ని మొట్ట మొదటిసారి భూమిపై చెప్పిన శ్రీ శుక మహర్షి జన్మ రహస్యాన్ని చెప్పటం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో వ్యాస మహర్షి మేరు పర్వత శిఖరం పైకి వెళ్లి అక్కడ మహాశివుని కోసం ఘోర తపస్సు చేసాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏమికావాలో కోరుకోమనగా పంచభూతాలకు సమా...